Tuesday, April 3, 2012

భర్త హత్యకు గూండాలను ఆశ్రయించిన మహిళపై అత్యాచారం

ఆమె 39 సంవత్సరాల వయసున్న వివాహిత.. 14 ఏళ్ల వయసు కుమారుడు కూడా ఉన్న........................ ఈ అతివ తనకన్నా మరో 14 ఏళ్లు చిన్నవాడయిన ఒక ధనిక కుటుంబపు కుర్ర రైతుతో ప్రేమలో పడింది. వివాహేతర సంబంధాన్ని కొనసాగించింది. తమ బంధానికి అడ్డు వస్తున్నాడనే కారణంతో ఏకంగా కట్టుకున్న భర్తనే చంపేయాలని నిర్ణయించుకుంది. ఇందుకు ప్రియుడితో కలిసి గూండాల సహకారం తీసుకుంది. చివరకు ఆ గూండాల చేతిలోనే అత్యాచారానికి గురయింది.

కోల్కతా సమీపంలో ఈ సంఘటన వెలుగుచూసింది. తన కుర్ర ప్రియుడైన జికో పాల్ అలియాస్ పోట్లాతో కలిసి ఆమె వేసిన ఈ పన్నాగం తుదకు ఈ విధంగా బెడిసికొట్టింది. వివాహిత మహిళ, ఆమె ప్రియుడు పోట్లా కలిసి గత నెల 28వ తేదీన నలుగురు వ్యక్తులను కిరాయికి మాట్లాడుకున్నారు. తమ ప్రణాళికలో భాగంగా పోట్లా రాత్రి వేళ ఆ నలుగురు గూండాలను తన ప్రియురాలు ఇంటికి తీసుకెళ్లాడు. హత్యను ఒక దోపిడిదారులు చేసినదిగా చిత్రించేలా చేయాలని వారు ముందుగానే నిర్ణయించుకున్నారు.

పోట్లాతో పాటు ఆ నలుగురు గూండాలు బయట మాటు వేసారు. భర్త (50) బయటకు రాగానే హత్య చేయాలని వారి పథకం. అతను రాత్రి వేళ మూత్ర విసర్జనకు రాగానే, ముందస్తు ప్రణాళిక ప్రకారం ఆ మహిళను, ఆమె కుమారుడిని తాళ్లతో కట్టేసారు. ఆమె భర్తను కత్తులతో పొడిచి చంపేసారు. ఇంట్లో ఉన్నదంతా దోచుకున్నారు. చివరకు వారి దృష్టి ఆమెపై పడింది.

ఒకరి తర్వాత ఒకరు ఆమెపై అత్యాచారానికి దిగారు. ఇదంతా ఆమె ప్రియుడు, 14 ఏళ్ల కుమారుడు చూస్తుండగానే జరిగింది. తమ ప్లాను ఇలా అడ్డం తిరగడంతో అవాక్కయిన పోట్లా గూండాలను అడ్డుకోవాలని తీవ్రంగా ప్రయత్నించాడు. ఆమెను విడిపించడం తన వల్ల కాకపోవడంతో వారిని బతిమాలుతూ విలపించడం మొదలెట్టాడు.

ఆ సమయంలో వారి చెరలో నుండి తప్పించుకున్న ఆమె కుమారుడు గ్రామంలోకి పరుగెత్తుకుంటూ వెళ్లి గ్రామస్తులకు సమాచారం అందించడంతో వ్యవహారం బయటపడింది. అయితే, ఇంత జరిగినప్పటికీ తొలుత ఆమె తనపై అత్యాచారం జరిగిన విషయాన్ని పోలీసులకు ఫిర్యాదు చేయడానికి నైరాశ్యం ప్రదర్శించింది. వైద్య పరీక్షలు కూడా ఆమెపై నలుగురు వ్యక్తులు అత్యాచారం జరిపారని స్పష్టం చేస్తున్నా ఆమె ఈ విషయంపై నోరు మెదపకపోవడంతో పోలీసుల్లో అనుమానం పెరిగింది. దాంతో వారు తీవ్రంగా ప్రశ్నించారు.

అయితే, అందుకు ఆమె చెప్పిన సమాధానాలకు పొంతన కుదరలేదు. దాంతో మరింత లోతుగా దర్యాప్తు మొదలెట్టి అసలు విషయం బయటపడేలా చేసారు. ఆమెతో పాటు ఆమె ప్రియుడు పోట్లాను అరెస్టు చేసారు. తమదైన శైలిలో దర్యాప్తు చేయగా పోట్లా విషయాలన్నీ కక్కేసాడు. నిజానికి, పోట్లా ఈ గూండాలను కిరాయికి మాట్లాడుకునే సమయంలో, తనకు, ఆ మహిళకు మధ్య అక్రమ సంబంధం ఉందనే విషయాన్ని దాచిపెట్టాడు. చివరకు తాను నియమించుకున్న ఆ వ్యక్తులే తన ప్రౌఢ ప్రియురాలిపై అత్యాచారానికి ఒడిగట్టడం చూసి బిత్తరపోయాడు. ఈ విషయాలన్నీ పోలీసులతో చెపుతూ పోట్లా బోరున విలపించాడు.

No comments:

Post a Comment